
హైదరాబాద్ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50 రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల లాక్ డౌన్ ను సీపీలు, డీసీపీలు పర్యవేక్షిస్తున్నారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు.