
కరోనా ను నివారించడానికి కర్ణాటకలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నది. లాక్ డౌన్ విధించడం వల్ల కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నాయని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్. అశోక అన్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీలో లాక్ డౌన్ వల్ల కేసులు భారీగా తగ్గాయని, అదే విధంగా కర్ణాటకలో కూడా 14 రోజుల లాక్ డౌన్ ను మే 24 తర్వాత కూడా పొడిగిస్తే బాగుంటుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ వంటి ఆంక్షలను కరోనా కర్ఫ్యూ పేరుతో గత నెల 26 న సీఎం యెడియూరప్ప ప్రకటించారు.