
వ్యవసాయబిల్లుపై రాజ్యసభలో జరిగిన రచ్చపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా స్పందిస్తున్నాయి. సభ్యుల సస్పెన్షపై మంగళవారం ప్రతిపక్షాలు వాకౌట్ చేయగా సభ డిప్యూటీ చైర్మన్ రాష్ట్రపతికి లేఖ రాశారు. సభ్యలో ఎంపీల తీరు ప్రవర్తనపై ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం పేరిట సభ్యులు హింసాత్మకంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ పరిమాణాలు తనను ఆవేదనకు గురి చేశాయని, అందుకే ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నానని హరివంన నారాయన్ సింగ్ చెప్పారు. తన దీక్షతో సభ్యులు పశ్చాతాపం చెందాలని కోరుకుంటున్నానని లేఖలో తెలిపారు.