Lenin Movie : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరగలేదు కానీ , విడుదల తర్వాత టాక్ వచ్చిన తర్వాత మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్ లో అక్కినేని సినిమాకు బుకింగ్స్ జరిగి చాలా కాలం అయ్యింది. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఏ రేంజ్ వసూళ్లు రాబోతున్నాయి అనేది ఇప్పుడు అంచనాకి వద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
అంటే షేర్ వసూళ్లు 5 నుండి 6 కోట్ల రూపాయిల మధ్యలో ఉంటుందని అంచనా. ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కృష్ణా , గుంటూరు , నెల్లూరు , రాయలసీమ , గోదావరి జిల్లాలు కలిపి ఈ చిత్రానికి మరో 2 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నైజాం ప్రాంతం లో అయితే 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
అంటే షేర్ వసూళ్లు 2 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 70 నుండి 1 కోటి రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు రావొచ్చని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 3 లక్షల డాలర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2 కోట్ల 90 లక్షల గ్రాస్ ఉంటుందని , షేర్ వసూళ్లు 1 కోటి 50 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
