
తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తనతో టచ్ లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు చెప్పారు. తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. ఆ తరువాత సీఎం కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇవాళ ముగ్గురు నేతలు తనను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారన్నారు.