
ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్న్ కొనుగోలు, 9 నుంచి 12వ తరగతులు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విజయనగరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సటీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.