https://oktelugu.com/

కొవిడ్ మృతదేహాన్ని నదిలో విసిరేశారు..

ఉత్తర్ ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపిన జిల్లా వైద్యాధికారులు అది కొవిడ్ వ్యక్తి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 30, 2021 / 04:14 PM IST
    Follow us on

    ఉత్తర్ ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఆ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో కనిపించింది. అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు జరిపిన జిల్లా వైద్యాధికారులు అది కొవిడ్ వ్యక్తి మృతదేహమేనని ధ్రువీకరించారు. చనిపోయిన వ్యక్తి బంధువులే నదిలో పడవేసినట్లు గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.