
తెలంగాణలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. బుధవారం కింగ్ కోఠిలోని తన కార్యాలయంలో డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.