
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ మొదటి ప్రభంజనం చూపినంత ప్రభావం రెండో ప్రభంజనం చూపలేదని భారతీయ రిజర్వ బ్యాంకు తెలిపింది. అయితే అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది. పునరుత్తేజానికి ప్రైవేటు డిమాండ్ చాలా ముఖ్యమైనదని వివరించింది. కోవిడ్ రెండో ప్రభంజనం విజృంభణను ఎంత వేగంగా మన దేశం అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి అవకాశాలు ఆధారపడినట్లు తెలిపింది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది.