
కొవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే దవాఖాన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం అమలు తీరు, బిల్లులు వసూలు ఆంశంపై వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం నిఘా పెడుతుందని తెలిపారు. కొన్ని చోట్ల కొవిడ్ బాధితుల నుంచి భారీ మొత్తం లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు.