
మెదక్ జిల్లా మాసాయి పేట భూముల సర్వే పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 5న అధికారులు ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానంలో ఆమె సవాల్ చేశారు. జమున తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆసైన్ మెంట్ భూములు తేల్చేందుకే నోటీసులు ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం భూములు ఎవరివో తేలిస్తే తప్పేంటని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సరైన కారణం లేకుండా సర్వే నోటీసులు ఇచ్చారని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. ఈ పిటిషన్ పై వాదనలు ముగించిన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.