
కొవిడ్ సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు 594 మంది వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బుధవారం తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 107 మంది డాక్టర్ల మరణాలు నమోదయ్యాయి. కరోనా మొదటి వేవ్ లో దేశ వ్యాప్తంగా 748 మంది వైద్యులు చనిపోయినట్లు ఐఎంఏ తెలిపింది. బిహార్ 96, ఉత్తరప్రదేశ్ లో 67, రాజస్థాన్ లో 43, జార్ఖండ్ లో 39, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 32 మంది చొప్పున మరణించినట్లు ఐఎంఏ నివేదికలు వెల్లడించాయి.