
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. ప్రజల కోసం పని చేసే మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్ లపై పెగాసస్ ను వాడుతూ గోప్యతా హక్కును హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సంఘిటితమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.