KL Rahul: లీడ్స్ టెస్ట్ పై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో కచ్చితంగా ఫలితం తేలుతుందని నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ అన్నాడు. అలాగే జట్టులో తనకు విభిన్న బాధ్యతలు, పాత్రలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నాడు. తనకు సరిపోయే బ్యాటింగ్ ఆర్డర్ ఏంటో తిరిగి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. రెండు సంవత్సరాలుగా బ్యాటింగ్ ఆర్డర్ లో నా స్థానం ఏంటి నేను మర్చిపోయాను. నాకు విభిన్న బాధ్యతలు, పాత్రలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నాడు.