Katrina Kaif Yoga Poses: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా పాపులర్ అయ్యి, ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి కత్రినా కైఫ్(Katrina Kaif). విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెంటనే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అల్లరి పిడుగు’ చిత్రం చేసింది. కేవలం ఈ రెండు సినిమాలతోనే మన యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ షారుఖ్ ఖాన్(Shahrukh Khan),సల్మాన్ ఖాన్(Salman Khan),హృతిక్ రోషన్(Hrithik Roshan), అమీర్ ఖాన్(Aamir Khan), అక్షయ్ కుమార్(Akshay Kumar), అజయ్ దేవగన్(Ajay Devgan) ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించి,ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది కత్రినా కైఫ్.
అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఈమె ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal)(చావా హీరో) ని ప్రేమించి పెళ్లాడింది. అప్పటి వరకు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వచ్చిన కత్రినా కైఫ్,ఆ తర్వాత స్పీడ్ తగ్గించింది. 2021 వ సంవత్సరం తర్వాత ఈమె కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసింది. అందులో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘టైగర్ 3’ కూడా ఒకటి. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె ఎలాంటి చిత్రం లోనూ నటించలేదు. చాలా ఏళ్ళ క్రితం తెరకెక్కించిన మెర్రీ క్రిస్మస్ అనే చిత్రం గత ఏడాది విడుదలైంది. ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి ఇందులో హీరో గా నటించాడు. అయితే సినిమాలకు ప్రస్తుతం దూరం గానే ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆమె నిత్యం టచ్ లోనే ఉంటుంది. ఆమె అప్లోడ్ చేసే ఫోటోలకు లక్షల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి.
Also Read: Katrina Kaif- Vicky Kaushal: కత్రినా కైఫ్ కి నిద్ర రాకపోతే విక్కీ కౌశల్ ని ఏం చేయమంటుందో తెలుసా?
రీసెంట్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ కొన్ని ఆసనాలు వేస్తూ కనిపించింది. ఆమె వేసిన భంగిమలు అనితర సాధ్యమైనవి గా కనిపించాయి. ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంటే తప్ప ఇలాంటి ఆసనాలు వెయ్యడం కష్టమని నిపుణులు సైతం చెప్తున్నారు. ఆ ఆసనాలను మీరు కూడా చూసేయండి. కత్రినా కైఫ్ వయస్సు ప్రస్తుతం 41 ఏళ్ళు. ఇంత వయస్సు వచ్చినప్పటికీ కూడా ఆమె కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటే అందుకు కారణం ఆమె ఇలాంటి వర్కౌట్స్ మరియు యోగాసనాలు వెయ్యడం వల్లే, ఇదే ఆమె సౌందర్య రహస్యం అని అందరు అంటూ ఉంటారు. మీరు కూడా ఇలాంటివి ప్రయత్నం చేయాలనుకుంటే ఇంట్లో చేయండి. ఇకపోతే ప్రస్తుతం కత్రినా కైఫ్ ఖాళీ గానే ఉంటుంది. సినిమాలు చేయడానికి సిద్దంగానే ఉంది కానీ, సరైన పాత్రలు దొరకడం లేదట.