
రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మైనారిటీ సబ్ ప్లాన్ ను ఆమోదించింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం చట్టసవరణకు ఆమోదం తెలిపింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ తొలగించేందుకు అంగీకరించింది. ఆర్అండ్ బీ ఖాళీ స్థలాలు, భవనాలు ఆర్టీసీకి బదలాయిస్తామంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకి’తో కలిసి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది.