
కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గించారు. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే 3 మందులకు పన్ను మినహాయింపునిచ్చారు. అయితే వ్యాక్సిన్ల జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 శాతం జీఎస్టీ యధావిధిగా అమలవుతుందని తెలిపారు. వ్యాక్సిన్లపై జీఎస్టీ వడ్డింపు నుంచి ఊరట లభిస్తుందని ఎదురు చూసిన వారికి ఊరట లభించలేదు.