Kerala Kumbh Mela : కేరళలో కుంభమేళ.. దేశంలో అతిపెద్ద కుంభమేళ యూపీలోని ‘ప్రయాగ’.. ఇదే మదర్ ఆఫ్ ఆల్ కుంభమేళాస్.. మనదగ్గర కూడా ఉన్నాయి. గోదావరి, కృష్ణ పుష్కరాలు జరుపుకుంటాం.. 250 సంవత్సరాలుగా మిగతా లాగానే కేరళలో కుంభమేళా జరుగుతుండేది. 17వ శతాబ్ధం చివరలో ఈ కుంభమేళ ఆగిపోయింది. ఈ కుంభమేళను 250 ఏళ్లుగా కేరళలో మరిచిపోయారు.
జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకూ 15 రోజులు ఇది జరిగింది. దీన్ని ‘మహా మాగం’ అంటారు. లేకపోతే మా మంగం అంటారు. దీనికి ఎక్కడా ప్రచారం లేదు. ప్రభుత్వ సహకారం లేదు. అలాగే మీడియా సహకారం లేదు. ఎలా సాధ్యమైంది..?
కేరళ కుంభమేళ చరిత్ర చూస్తే.. ‘భారత్ పూజ’ అనే నది తమిళనాడు అన్నామలై కొండల్లో పుట్టి పాల్ ఘాట్ గుట్టల నుంచి ప్రవహించి అది అరేబియా సముద్రంలో కొచ్చిన్ పైన కలుస్తుంది. ఇది జరిగేటువంటి ప్లేసు ‘తిరునవాయ’.. బ్రహ్మ, శివ, విష్ణు దేవాలయం కలిసే చోట ఈ కుంభమేళ జరుగుతుంది. 70 శాతం ముస్లింలున్న ఈ ప్రాంతంలో హిందుత్వ కుంభమేళ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
250 సంవత్సరాల తర్వాత తిరిగి కేరళ కుంభమేళా.. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.