Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 postponed: 'ధురంధర్ 2' దాదాపుగా వాయిదా పడినట్టే..ఎన్ని రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందో...

Dhurandhar 2 postponed: ‘ధురంధర్ 2’ దాదాపుగా వాయిదా పడినట్టే..ఎన్ని రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందో తెలుసా?

Dhurandhar 2 postponed: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. కేవలం హిందీ వెర్షన్ తోనే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోక్ అడుగుపెట్టి, కేవలం మూడు వారాల్లోనే 18 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ […]

Dhurandhar 2 postponed: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. కేవలం హిందీ వెర్షన్ తోనే థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోక్ అడుగుపెట్టి, కేవలం మూడు వారాల్లోనే 18 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని టాప్ 1 లో కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓటీటీ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కూడా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు .

ఈ సినిమాని మార్చి 19 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఆ తేదీన విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు విశ్లేషకులు. కారణం షూటింగ్ ఆగిపోవడమే. ముంబై లోని కొన్ని వీధుల్లో పాకిస్థాన్ సెట్స్ వేసి ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది , కానీ మేకర్స్ చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా షూటింగ్ ఆగిపోయింది. నిషేదిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు ఎగరవేశారు . దీనిని గమనించిన మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వెంటనే షూటింగ్ ని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతే కాదు రూల్స్ ని బ్రేక్ చేసినందుకు కోర్ట్ లో కేసు కూడా వేసింది. అయితే రీసెంట్ గా ‘ధురంధర్ 2’ టీం ఆ ప్రాంతం లో షూటింగ్ చేసుకునేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను రిక్వెస్ట్ చేయగా వాళ్ళు నిరాకరించారు.

అంతే కాకుండా ఈ ప్రాంతం లో శాశ్వతంగా సినిమా షూటింగ్స్ రద్దు చెయ్యాలంటూ ప్రభుత్వానికి ఉత్తర్వులు కూడా రాశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈ షూటింగ్ పూర్తి అవ్వడం, ఎడిటింగ్, రీ రికార్డింగ్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వడం, మార్చి 19న రావడం దాదాపుగా ఆసాద్యమే. ఒకవేళ అదే కనుక జరిగితే అదే రోజున విడుదల కాబోతున్న యాష్ ‘టాక్సిక్’ చిత్రానికి సోలో విడుదల ఉంటుంది. పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్ ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper