
తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శవాలతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందన్నారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతోంటే రాజకీయాలు చేయటం తగదన్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాల సాయం చేస్తోందన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందనటం దురదృష్టకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్ లో సైతం ఆక్సిజన్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.