నాయీ బ్రాహ్మణుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని. ఎన్నికల సమయంలో నాయీ బ్రాహ్మణుల ఇచ్చిన హామీలని నెరవేర్చకుండ వారిని మోసం చేసి, ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్న వారి సమస్యలని గాలికి వదిలేసి దున్నపోతు మీద వాన కురిసినట్లు కేసీఆర్ వ్యవహిస్తున్నారు” అని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్. నాయీ బ్రాహ్మణులకు సిఎం కేసీఆర్ చేసిన మోసానికి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో వినూత్న నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు దాసోజు. ఈ కార్యక్రమంలో గాంధీ విగ్రహం వద్ద క్షవరం చేసి , గెడ్డం గీసి వినూత్న నిరసన తెలిపారు దాసోజు.
ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మణులు రాజకీయ చైతన్యం కలిగిన వారు. గ్రామాల్లో రాజకీయ విశ్లేషకులు నాయీ బ్రాహ్మణులు. జట్టు, గెడ్డం కత్తిరిస్తూనే గ్రామాల్లోని రాజకీయాన్ని లోతుగా విశ్లేషించే తెలివిపరులు. అద్భుతమైన రాజకీయ ప్రచారకర్తలు. వారిని గనుక తమవైపు తిప్పుకుంటే ఓట్లు దండుకోవచ్చని భావించిన కేసీఆర్ .. వారిని మభ్యపెట్టి అనేక వాగ్దానాలు చేశారు. 30వేల మోడ్రన్ సెలూన్లు కడతామని హామీ ఇచ్చారు. 250యూనిట్ల వరకు ఉచిత విధ్యుత్ ఇస్తామని చెప్పారు. నాయీ బ్రహ్మణ ఫెడరేషన్ పెడతామని చెప్పారు. నాయీ బ్రహ్మణులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చారు. నాయీ బ్రాహ్మణులు తన మాట వింటే ప్రతి సెలూన్ లో తన పార్టీ ప్రచారం జరిగిపోతుందనే ఆలోచనతో కేసీఆర్ ఈ వాగ్దానాలు చేశారు. అయితే ఈ వాగ్దానాలు ఎక్కడి వెళ్ళాయి ? అని ప్రశ్నించారు దాసోజు.
ప్రగతి నివేదన సభ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు కమర్షియల్ టారిఫ్ నుంచి డొమెస్టిక్ టారిఫ్ కు కరెంటు బిల్లులు మార్చినట్టు అబద్దాలు చెప్పారు. డొమెస్టిక్ టారిఫ్ అమలు చేస్తున్నట్లు తేదీ 6.01.2016 నాడు జీవోఎం ఎస్ నెంబర్ 1 ను విడుదల చేసినా నేటికి అమలు కాకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి, చిత్తశుద్దిలేని తనానికి నిదర్శనం . తానిచ్చిన జీవో అమలుకు నోచుకోకున్నా సినిమాలో కోటా శ్రీనివాస రావు కోడిని చూపించి చికెన్ బిర్యాని తిన్నట్లు మభ్యపెట్టారు” అని విమర్శించారు దాసోజు.
”నాయీ బ్రాహ్మణులు నాగరికతకు చిహ్నమైన బిడ్డలు. మనిషి జీవన విధానం బాగామైన బిడ్డలు. కడుపు నుంచి కాటి వరకూ వారి పాత్ర విశిష్టమైనది. మంగళప్రధమైన వ్రుత్తి వారిది. అలాంటి బిడ్డలు నేడు దయనీయ స్థితిలో వున్నారు. మోడరన్ టెక్నాలజీ, ఆధునిక సెలూన్ రాకతో సాంప్రదాయ వృత్తిని నమ్ముకున్న వారు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి నాయీ బ్రాహ్మణుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కేసీఆర్. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన వాగ్దానాలని కేసీఆర్ ఎందుకు నెరవేర్చడం లేదు ? 30వేల మోడ్రన్ సెలూన్లు ఎందుకు నిర్మించడం లేదు ? . 250యూనిట్ల వరకు ఉచిత విధ్యుత్ ఎందుకు ఇవ్వడం లేదు ? నాయీ బ్రహ్మణులకు ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వడం లేదు ? బడ్జెట్ లో రూ. 250 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎందుకు చేయలేదు ? కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి డిమాండ్ చేస్తున్నాం. . నాయీ బ్రహ్మణులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ యుద్ద ప్రాతిపదికన నెరవేర్చాలి” అని కోరారు దాసోజు?
”నాయీ బ్రహ్మణులది మంగళకరమైన కులం. సుచి శుభ్రతకు మారుపేరైన కులం. సమాజానికి నాగరికత నేర్పిన కులం. కానీ ఈవాళ రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వం ఇచ్చే పధకాల కోసం దయనీయ స్థితిలో ఎదురుచూసే పరిస్థితికి తీసుకొచ్చారు కేసీఆర్. నాయీ బ్రహ్మణుల కులంలో సంగీత విద్వంసకారులు. సురవైద్యశాలలు. గ్రామాల్లో మొట్టమొదటి ఆయుర్వేద వైద్యం అందించిన కులం నాయీ బ్రహ్మణులది. అలాంటి వారిని నేడు యాచకులుగా మార్చారు కేసీఆర్. ఇంత మోసం చేయడం కేసీఆర్ కి తగునా ? కేసీఆర్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. నాయీ బ్రహ్మణులకు జుట్టు కత్తిరించడమే కాదు అవసరమైతే తోకలు కూడా కత్తిరించడం తెలుసు. గెడ్డం గీయడమే కాదు అవసరమైతే.. మమ్మల్ని మోసం చేసిన వారికి గుండుకొట్టి గద్దె దించడం కూడా తెలుసు” అని హెచ్చరించారు దాసోజు.
బీసీలు ఏం పాపం చేశారు కేసీఆర్ ??
52శాతం వున్న బీసీలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో బాగమై రాష్ట్ర సాధనలో బాగామయ్యారు. అనేక మంది ఆత్మ బలిదానాలు చేశారు. కానీ నేడు త్యాగాలు ఒకరివి . బోగాలు మరొకరికి అన్నట్టుగా వుంది. బీసీలు అంటే కేసీఆర్ కి ఎందుకు అంత చిన్న చూపు ? బీసీలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు?” అని ప్రశ్నించారు దాసోజు. 25వేల కోట్ల రూపాయిలు మొదటి టర్మ్ లో ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. కానీ పది కోట్లు కూడు ఖర్చు చేయలేదు. గత రెండేళ్ళుగా కూడా ఐదు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఫెడరేషన్లకు పాలక మండలి లేదు , చైర్మన్ లేరు , ఎంబీసీ, ఎండీసి కార్పోరేషన్స్ నిధులు లేవు, బీసీలని దయనీయ స్థితిలోకి నెట్టేయడం కేసీఆర్ కి తగునా ? బీసీలు ఏం పాపం చేశారు ? త్యాగాలు బీసీలవి .. బోగాలు మీకా ?” అని ప్రశ్నించారు దాసోజు.
ఈ కార్యక్రమంలో పిసిసి ఫిషరిష్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, శ్రీకాంత్ గౌడ్, నాయీ బ్రహ్మణ రాష్ట్ర స్థాయి నాయకుడు కొలిపాక సతీష్ తదితర ముఖ్య నేతల పాల్గొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Kcr fails to implement the promises given to nai brahmins dasoju shravan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com