kcr criticism Chandrababu : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR) చాలా రోజుల తర్వాత పొలిటికల్ స్క్రీన్ పై కనబడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకు కనిపించలేదు. ఒకటి రెండు సార్లు శాసనసభకు హాజరయ్యారు. మళ్లీ ముఖం చాటేశారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మిశ్రమ ఫలితాలు రావడంతో బయటకు వచ్చారు. మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పై విమర్శలు చేసే క్రమంలో చంద్రబాబు ప్రస్తావన తెచ్చి తనలో పాత కేసీఆర్ ను నిద్ర లేపారు. ఏపీ పెట్టుబడులపై.. చంద్రబాబు సర్కార్ చేస్తున్న పెట్టుబడుల సదస్సులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తద్వారా ఇప్పటికీ తాను జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు అని చెప్పే ప్రయత్నం చేశారు కెసిఆర్.
* టిడిపి తటస్థ వైఖరితో..
తెలంగాణలో ( Telangana) తాను అధికారానికి దూరం కావడానికి చంద్రబాబు కారణం అన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా గులాబీ పార్టీని దెబ్బతీసింది. 2014లో తొలిసారిగా తెలంగాణలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 15 స్థానాలను కైవసం చేసుకుంది అప్పట్లో. అయితే తెలుగుదేశం పార్టీ ఉంటే గులాబీ పార్టీకి ఇబ్బందికరమని భావించిన కేసీఆర్ ఎంత దెబ్బతీయాలో అంతలా తీశారు. ఈ పరిస్థితుల్లో 2018లో టిడిపి కాంగ్రెస్ పార్టీతో జతకలిసింది. దానిని ఓర్వలేకపోయారు కెసిఆర్. అందుకే ఏపీలోని జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసి 2019 ఎన్నికల్లో.. తెలంగాణలో అధికార పార్టీగా ఉండి అన్ని విధాల సాయం చేశారు కేసీఆర్. తద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని గర్వంగా ప్రకటించుకున్నారు కేసీఆర్. అయితే కెసిఆర్ కొట్టిన దెబ్బను మనసులో ఉంచుకున్న చంద్రబాబు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా టిడిపిని పోటీ చేయించలేదు. కానీ టిడిపి నుంచి అనుకోని రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి.. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మద్దతు తెలిపింది. తద్వారా తెలంగాణలో రేవంత్ అధికారంలోకి రాగలిగారు.. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్రబాబు ఉన్నారు అన్నది కేసీఆర్ అనుమానం. అందుకే గురువు చంద్రబాబుకు మించిన తెలివితేటలను రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో ప్రదర్శిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు కేసీఆర్.
* తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ..
ఇటీవల తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల విషయంలో పోటీపడుతున్నాయి. ముందుగా ఏపీలో పెట్టుబడుల సదస్సు జరిగింది. భారీగా పెట్టుబడులు రావడంతో పాటు కొన్ని పరిశ్రమలు, సంస్థలు నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్( Google data centre) విశాఖకు వచ్చింది. అయితే దీనిపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వంట మనుషులతో పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డికి పెట్టుబడుల విషయంలో మంచి పేరు రావడం కేసీఆర్ కు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఏపీ గురించి మాట్లాడానికి కేసీఆర్.. ఇప్పుడు చంద్రబాబు కొన్ని రకాల క్రెడిట్ దక్కించుకునేసరికి తట్టుకోలేకపోతున్నారు. పైగా తన మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటిని అధిగమించేందుకు వీలుగా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు కేసీఆర్. తన పాత ప్రత్యర్థిని కెలకడమే కాకుండా బిజెపిపై కూడా విమర్శలు చేశారు. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తెలంగాణ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చిన కెసిఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయ తేనె తుట్టను కదిపారు. చూడాలి మరి ఎలాంటి స్పందన వస్తుందో?
చంద్రబాబు జిమ్మిక్కులకు సెటైర్లు వేసిన కేసీఆర్
చంద్రబాబు బిజినెస్ లు మీటు పెట్టి హోటల్లో పనిచేసే వాళ్లతో, వంట మాస్టర్లతో ఏంఓయూ మీద సంతకాలు చేపించాడు- కేసీఆర్ pic.twitter.com/tTDIrtqeR0
— greatandhra (@greatandhranews) December 21, 2025