Homeటాప్ స్టోరీస్Kavitha vs KTR : కవిత వ్యాఖ్యలు.. కేటీఆర్ సంచలన ట్వీట్

Kavitha vs KTR : కవిత వ్యాఖ్యలు.. కేటీఆర్ సంచలన ట్వీట్

Kavitha vs KTR : జాగృతి అధినేత్రి సోమవారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మేఘా కృష్ణారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీరి ముగ్గురి వల్లే కెసిఆర్ కు మరక అంటుకున్నదని కవిత ఆరోపించారు. తన తండ్రి మీద ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థను విచారణకు ఆదేశించిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. ఊడితే ఎంత అన్నట్టుగా జాగృతి అధినేత్రి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ తరహా వ్యాఖ్యలను అధికార పార్టీ లేదా ఇతర వ్యక్తులు చేసి ఉంటే తెలంగాణలో పెద్దగా చర్చ జరిగి ఉండేది కాదు. స్వయాన గులాబీ అధినేత కుమార్తె ఈ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో రాజకీయంగా సంచలనం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకొని అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలా అవినీతి జరిగిందని తెలిసే మా ముఖ్యమంత్రి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ వ్యవహారాన్ని అప్పగించారని చెబుతున్నారు.

జాగృతి అధినేత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గులాబీ పార్టీ సామాజిక మాధ్యమాలలో తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. కవితను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ.. ఆదివారం శాసనసభలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. నిండు శాసనసభలో ఆరడుగుల బుల్లెట్ అధికార పార్టీని ఆట ఆడుకున్నారని.. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులకు అసలు విషయం భోదపడాల్సి ఉందని రాసుకు వచ్చింది. మాజీ మంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ ట్వీట్ ను గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రీ ట్వీట్ చేశారు.

“మా పార్టీ నాయకుడు నిండు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యల ద్వారానైనా అధికార పార్టీ నాయకులు అసలు విషయం ఏమిటో తెలుసుకుంటారని ఆశిస్తున్నా. ఇదంతా కూడా వారు మననం లో పెట్టుకొని ఉంటారని భావిస్తున్నానని” గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. తన సోదరి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గులాబీ పార్టీ సోషల్ మీడియా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేయడం సంచలనం అయితే.. దానిని గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రీ ట్వీట్ చేయడం ద్వారా తమ పార్టీ మనోగతం ఏమిటో చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇదంతా కూడా జాగృతి అధినేత్రి తండ్రికి తెలియకుండా ఉండదని వారు ఉదహరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular