
బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ భార్య కరోనా బారిన పడింది. తాజాగా కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్పీ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుం నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. వారం క్రితం నాకు కరోనా సోకింది. పాజిటివ్ నిర్ధారణ అయ్యాక శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఇండియాలో ఎమర్జెన్సీ అంటే వెంటనే అడ్మిన్ చేసుకొని వైద్యం అందిస్తారు ఇక్కడ అలా లేదని తెలిపింది. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే ఇండియాకు వస్తాను అంటూ నీలిమ ఓ విడియో సోషల్ మీడియాలో పెట్టింది.