ఏపీ నెల్లూరులోని చెన్నై- కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. మహేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు.