టీ20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. బీసీసీఐ ఆ శుభవార్త ఎప్పుడు చెబుతుందా..? అని ఆరాటపడుతున్నారు. అయితే భారత్ లో జరగాల్సిన టీ 20 కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఈ టోర్నీ ఇక్కడ జరిగే అవకాశం కనిపించడం లేదు. కరోనా కారణంగా టీ20ని యూఏఈలో నిర్వహించనున్నట్లు సమాచారం. అంతకుముందు ఈ మెగా టోర్నీని ఇక్కడ నిర్వహించేందుకు ఐసీసీఐని గడువు కోరింది. అయితే పరిస్థితులు ఇంకా చక్కబడడం లేనందును టీ20ని యూఏఈ లో నిర్వహించాలని చూస్తోంది.
అయితే టీ20 నిర్వహణ డేట్ కూడా బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు 28 రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నీలోని మ్యాచ్ లు అబుదాబి, దుబాయ్, షార్జా లల్లో జరగనుంది. అలాగే మస్కట్ లోనూ ఓ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ఐపీఎల్ 2021 మ్యాచ్ లు కొనసాగుతుండగానే కరోనా కేసులు విజృంభించాయి. దీంతో ఆ మ్యాచ్ లు నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. మిగిలిన మ్యాచ్ లను యూఏఈలోనే టీ20 టోర్నికి ముందు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళిక కూడా వేశారు. అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఖరారు చేశారు. మొదటి వారంలో ఒమన్లో నిర్వహించనున్నారు. అయితే రెండు టోర్నీల కు మధ్య కరనీం 7 రోజుల వ్యవధి ఉండాలని చూస్తున్నారు.