
ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో మాట్లాడారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోరాటాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. అత్యధిక సంఖ్యలో యూపీలో వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇక్కడే అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లు ఇస్తున్నారని మోదీ అన్నారు. పూర్వాంచ్ లో కాశీ క్షేత్రం మెడికల్ హబ్ గా మారినట్లు ఆయన తెలిపారు. ఒకప్పడు కాశీ ప్రజలు చికిత్స కోసం ఢిల్లీ లేదా ముంబై వెళ్లేవారని, కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నట్లు చెప్పారు.