Kamal Haasan: కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ సినిమాను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మసనం ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారని కమల్ ను ప్రశ్నించింది. క్షమాపణలు చెప్పాలని కోరితే చెప్పకుండా కోర్టుకు వచ్చారు. మీరు సామాన్య వ్యక్తి కాదు. ఇష్టానుసారం మాట్లడటం సరైంది కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.