IPL Final Match : నేడు IPL ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే IPL టోర్నమెంట్స్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవని ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు'(RCB) మరియు ‘పంజాబ్ కింగ్స్'(PBKS) టీమ్స్ మధ్య జరుగుతున్నాయి కాబట్టి. ఇద్దరికీ ఈ ట్రోఫీ ఎంతో అవసరం. ముఖ్యంగా RCB ఫ్యాన్స్ అయితే ఈ ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సుమారుగా 11 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఫైనల్స్ లోకి రావడం ఇప్పుడే జరిగింది. కోట్లాది మంది RCB ఫ్యాన్స్ కల ఈరోజు నెరవేరబోతుందా లేదా?, ఇన్నేళ్ల నుండి ఎదురు అవుతున్న ట్రోల్స్ కి చెక్ పడుతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని థియేటర్స్ స్పెషల్ స్క్రీనింగ్ చేస్తుంది.
PVR సంస్థ దేశవ్యాప్తంగా ఈ ఫైనల్ IPL లైవ్ మ్యాచ్ ని కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్ లో ప్రదర్శించబోతుంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో 15 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సిటీల వారీగా షెడ్యూల్ చేసిన షోస్ ని ఒకసారి చూద్దాము. హైదరాబాద్ సిటీ లో 16 షోస్ షెడ్యూల్ చేస్తే 16 షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. అదే విధంగా బెంగళూరు లో 28 షోస్ షెడ్యూల్ చేయగా 11 షోస్ ఫాస్ట్ ఫిల్లింగ్ అవ్వగా, 17 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. ముంబై లో 10 షోస్ షెడ్యూల్ చేయగా కేవలం ఆరు షోస్ మాత్రమే హౌస్ ఫుల్ అయ్యాయి. అదే విధంగా పూణే లో 7 షోస్ షెడ్యూల్ చేస్తే మూడు షోస్ హౌస్ అవ్వగా,ఢిల్లీ లో ఆరు షోలు, మైసూర్ లో ఆరు షోలు,అహ్మదాబాద్ లో 5 షోలు షెడ్యూల్ అయ్యాయి.
Also Read : రేపటి ఫైనల్ లో బెంగళూరా? పంజాబా? ఏ జట్టు విజయం సాధిస్తుందంటే?
అలా మొత్తం మీద ఇండియా వైడ్ గా 104 షోస్ షెడ్యూల్ చేస్తే 52 షోస్ ఫాస్ట్ ఫిల్లింగ్ అవ్వగా, 32 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈమధ్య కాలం లో థియేటర్స్ లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న మ్యాచ్ ఇదే అని అంటున్నారు. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అత్యధిక శాతం మంది RCB ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా, క్రేజ్ పరంగా టాప్ 3 లో ఒకరు. అదే విధంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(shreyas iyer) కి కూడా ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ ఏర్పడుతుంది.