retired IPS officer wife Case : తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రశాసన్ నగర్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇంతటి భద్రత ఉండే ప్రాంతంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఆమెను దారుణంగా అంతం చేశారు. ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాన్ని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకొచ్చారు. ఆమె అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ప్రాణం కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఇదే తేలింది.
కట్టుదిట్టంగా భద్రత ఉండే ప్రాంతంలో..
ప్రశాసన్ నగర్ లో భద్రత చాలా కట్టు దిట్టంగా ఉంటుంది. పోలీసులు కూడా నిత్యం గస్తీ కాస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఈ ఘటన ఎందుకు జరిగిందనేది అర్థం కావడం లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు దాదాపు 200కు పైగా సిసి టీవీల కేమెరాల ఫుటేజీ పరిశీలించారు. అంతేకాదు కొంతమంది పోలీసులు శుక్రవారం సాయంత్రం నేపాల్ వెళ్లినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కారు..
ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్పన, మరో ఇద్దరు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆటోలో ఎక్కారని.. వారు నాంపల్లి ప్రాంతంలో దిగినట్టు ఆధారాలు లభించాయి.. వారు నాగ్ పూర్ ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి వారు తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్టు తెలుస్తోంది. వి నేపథ్యంలో పోలీసులు ముందుగానే అక్కడికి వెళ్లారు. రైలు భోగిలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఈ ఘటనకు పాల్పడిన వారు మధ్యలోనే దిగి ఉంటారని తెలుస్తోంది.
ఇదంతా ఎందుకు చేసిందంటే
కల్పన నేపాల్ దేశానికి చెందిన యువతి. ఈమెకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. పైగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో డబ్బు బాగా ఉంటుందని ఒక అంచనాకొచ్చింది. పైగా ఈమె వెనుక ఒక ముఠా కూడా ఉంది. కొద్దిరోజుల క్రితం విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ ఇంట్లో పని మనుషులు కావాలని తెలిసింది. దీంతో ఆ ముఠా మనుషులు రంగంలోకి దిగారు. విశ్రాంత ఐపీఎస్ అధికారితో మాట్లాడారు. కల్పన మీ ఇంట్లో పని చేసేందుకు వస్తుందని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకున్నారు. అప్పటినుంచి కల్పన వినయ్ ఇంట్లో పని చేస్తోంది. వినయ్ ఈమెను ఇంట్లో మనిషి లాగా నమ్మారు. పైగా ఆయన భార్యకు ఆరోగ్యం అంతంత మాత్రమే. పిల్లలు వేరే ప్రాంతాలలో స్థిరపడ్డారు.. ఇటీవల వినయ్ ఆరోగ్యం సరిగా లేకపోతే బెంగళూరు వెళ్లారు. దానికంటే ముందు కల్పన ఇంట్లో మనిషిలాగా మెదిలిపోయింది. వినయ్ డబ్బులు పెట్టేది.. బంగారం దాచేది చూసింది. వినయ్ బెంగళూరు వెళ్ళిపోగానే ఆ ముఠా సభ్యులు ప్రణాళికను కల్పన చెప్పారు. కల్పన వారు చెప్పినట్టుగానే రంగంలోకి దిగింది. కొంతమంది వ్యక్తులతో కలిసి వినయ్ భార్యను అంతం చేసింది. ఇంతటి దారుణానికి పాల్పడేందుకు ప్రధాన కారణం డబ్బు, బంగారమే.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు చాలా వరకు ఆధారాలు సేకరించారు. త్వరలోనే కల్పన, ఆమె వెనుక ఉన్న ముఠా సభ్యులను పట్టుకుంటామని చెబుతున్నారు.
కల్పనతో చనువుగా ఉన్న వారిని..
కల్పనతో అత్యంత చనువుగా ఉన్న మహిళలను పోలీసులు విచారించారు.. వినయ్ కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం బెంగళూరు వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత కల్పన ఈ దారుణానికి పాల్పడింది. దానికంటే ముందు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడింది. సిసి కెమెరాలు మొత్తం రికార్డు అయ్యాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఒక ఫోన్ లభించింది. అందులో ఉన్న నంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురా లేదా నలుగురా అనేది తెలసి ఉంది. కల్పన మామూలు లేడీ కాదని.. ముందుగానే ఒక పథకం ప్రకారం ఇంట్లో పనిమనిషిగా చేరిందని.. ఆ తర్వాత మొత్తం దోచుకుని పోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమెకు ఈ ఆదేశాలు మొత్తం బయట నుంచి వచ్చాయని.. ఆమె వెనుక ఉన్న ఆ వ్యక్తులు ఎవరో త్వరలోనే బయట పెడతామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.