
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హచ్చరించారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదు. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేటీఆర్ తెలిపారు. పెంచిన స్టైఫండ్ ను వెంటనే అమలు చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.