
ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు హాజరుకానున్నారు. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అంశంతో పాటు వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అన్న అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది.