Jitesh Sharma: లక్నో పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ దినేశ్ కార్తీక్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దినేశ కార్తీక్ ఎప్పుడూ వర్తమానలో ఉండాలనే ఆలోచనలో ఉంటాడని చెప్పాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అయిన తరువాత మ్యాచ్ సాధ్యమైనంత వరకు చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నానని అన్నాడు. తమ మెంటార్ దినేశ్ కార్తీక్ కూడా తనకు ఇదే విషయం చెప్పాడని అన్నాడు. ఇక తన సామర్ధ్యం పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణిస్తూ ఆటను ముగించగలను అని చెప్పాడు.