Annadatha Sukhibhav : అన్నదాత సుఖీభవ పై( Annadata Sukhi Bhava ) ఫుల్ క్లారిటీ వచ్చింది. రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా 20 వేల రూపాయలు అందించే అన్నదాత సుఖీభవ పథకం అమలుపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కడప మహానాడు వేదికగా అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పిఎం కిసాన్ యోజన తొలి విడత నగదు పడిన సమయంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం అందిస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. సీఎం ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఖరీఫ్ ప్రారంభం నాటికి తమకు తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు అందుతాయని వారు నమ్మకం పెట్టుకున్నారు.
* అప్పట్లో రైతు భరోసాగా..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) 2019లో నవరత్నాల పథకంలో భాగంగా రైతు భరోసా పథకానికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 15000 రూపాయలు పెట్టుబడి ప్రోత్సాహంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వపరంగా 7500 కు మాత్రమే పరిమితం అయ్యారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ 6000 రూపాయల నగదు తో పాటు 13,500 అందించారు. అయితే తాము అధికారంలోకి వస్తే సాగు సాయం కింద ఏటా 20వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. అయితే కేంద్రం అందించే 6000 రూపాయల మొత్తానికి.. మరో 14 వేల రూపాయలను జతచేస్తూ.. 20000 అందించేందుకు నిర్ణయించడం విశేషం.
Also Read : అన్నదాత సుఖీభవ.. అర్హతలివే.. మార్గదర్శకాలు జారీ!
* ఆ రెండు పథకాలకు శ్రీకారం..
అయితే జూన్ నెలలో అన్నదాత సుఖీభవ తో పాటు తల్లికి వందనం( thalliki Vandanam ) పథకం అమలు చేస్తామని ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పుడు తల్లికి వందనం నగదును జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత సొమ్ము విడుదలకు సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేశారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ తొలి విడత రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐదువేల రూపాయల మొత్తాన్ని కలిపి అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తోంది. ఈ లెక్కన జూన్ మూడో వారంలో పిఎం కిసాన్ అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా సైతం అప్పుడే అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* చురుగ్గా ఎంపిక ప్రక్రియ..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో పడింది. అర్హుల జాబితా సిద్ధమయ్యాక పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియలు అధికారులు బిజీగా ఉన్నారు. అర్హుల జాబితా కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా జూన్ మూడో వారంలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.