
టీమ్ ఇండియాకు రెండో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ జిమ్మీ అండర్సన్ కట్టుదిట్టమైన బంతులతో ఇబ్బంది పెడుతున్నాడు. అతడు వేసిన మరో ఔట్ స్వింగర్ కు చెతేశ్వర్ పుజరా (1) ఔటయ్యాడు. 4.1 వ బంతికి అతడు కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. ఇండియా 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.