Jailer 2 Telugu rights : సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి చిత్రం ‘జైలర్’. వరుస ఫెయిల్యూర్స్ తో ఇక రజినీకాంత్ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో విడుదలైన ఈ చిత్రం , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి , ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ప్రభంజనం సృష్టించింది. నేటి తరం ఆడియన్స్ కి కూడా రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో తెలిసేలా చేసింది ఈ చిత్రం. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘జైలర్ 2’ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా షేర్ చేశారు మేకర్స్. అయితే ఈ సీక్వెల్ కి సంబంధించిన తెలుగు వెర్షన్ రైట్స్ ని మేకర్స్ భారీ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారట.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తి చూపుతుంది. కానీ సన్ నెట్వర్క్స్ సంస్థ ఏకంగా 60 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నారట. ఇది చాలా అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కూడా 52 కోట్ల రూపాయలకు అమ్మారు. బాక్స్ ఆఫీస్ వద్ద అది కేవలం 45 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టింది. అంటే 7 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది అన్నమాట. ఒక డబ్బింగ్ సినిమాకు 7 కోట్లు నష్టపోవడమంటే చిన్న విషయం కాదు. అయితే ‘కూలీ’ చిత్రం పాజిటివ్ టాక్ రాలేదు , పూర్తిగా డివైడ్ టాక్ వచ్చింది.
ఆ కారణం చేత మొదటి వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోయాయి. ఒకవేళ ఆ చిత్రానికి టాక్ వచ్చి ఉండుంటే, తెలుగు వెర్షన్ నుండే 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చి ఉండేవి, బ్యాడ్ లక్. అయితే ‘జైలర్ 2’ కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఏంటి?, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క చిన్న టీజర్ కంటెంట్ కూడా విడుదల అవ్వలేదు. కాబట్టి ఆ ప్రముఖ నిర్మాత 60 కోట్ల రూపాయిలు పెట్టి ఈ సినిమాని కొనుగోలు చేయడానికి కాస్త భయపడుతున్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఏమి జరగబోతుందో చూడాలి.