
ఎన్నికల సమయంలో సీఎం జగన్ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆయన మాట నమ్మి 30 లక్షల మంది వైసీపీని గెలిపించారని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు 10 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని తప్పుబట్టారు. సీఎం చెప్పిన మాటకి ఆచరణకు పొంతనే లేదని దుయ్యబట్టారు. లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని పవన్ తెలిపారు.