ఆంధ్రప్రదేశ్‌Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ షాక్...

Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ షాక్ ట్రీట్మెంట్!

Anil Kumar Yadav : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. సొంత నియోజకవర్గంలో శుభకార్యాలకు, ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారు. పార్టీ కార్యాలయాలతో పాటు అధికారిక కార్యక్రమాల విషయంలో ఆయనకు పిలుపు లేదు. అందుకే ప్రైవేట్ సమావేశాల పేరుతో ఆయన కాలం వెల్లదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం చూసి చూడనట్టుగా ఉన్నారు. దీంతో ఈ మాజీ మంత్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

* నరసరావుపేటలో ఓటమి..
మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. కానీ తర్వాత పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నరసరావుపేటలో రాజకీయాలు చేయడం అనిల్ కుమార్ యాదవ్ కు ఇష్టం లేదు. అలాగని తన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీలో రాజకీయం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ ఇప్పటికే పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒదిగిపోతున్నారు. ఆయన కోసమే జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో ఆలోచన పడ్డారని తెలుస్తోంది. అనిల్ నెల్లూరు సిటీకి వస్తున్నారు కానీ పార్టీ కార్యాలయానికి రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కార్యకర్తల ఇళ్లల్లో శుభకార్యాలకు హాజరవుతున్నారు. అక్కడే ప్రైవేటు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

* రెడ్డి సామాజిక వర్గం హెచ్చరికలతో..
సామాజిక లెక్కపరంగానే అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరుకు దూరంగా ఉంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ యాదవ్ వైఖరి మూలంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీలో ఇబ్బంది పడ్డారు. అటువంటి నేతలంతా సైకిల్ ఎక్కారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి అంత డ్యామేజ్ జరగడానికి రెడ్డి సామాజిక వర్గం నేతల పట్ల నిర్లక్ష్యం.. అనిల్ కుమార్ యాదవ్ కు ప్రాధాన్యం ఇవ్వడం అని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. మరోసారి నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కు చాన్స్ ఇస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికలకు మాదిరిగా.. 2029 ఎన్నికల్లో ఏదో ఒక చోట సర్దుబాటు చేస్తారే తప్ప.. నెల్లూరు బాధ్యతలు ఇవ్వరు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version