సర్కార్ ఆస్పత్రి వైద్యుల ‘ప్రైవేట్ వైద్యానికి’ జగన్ సర్కార్ చెక్

ఏపీలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యం అందించడంపై  ప్రభుత్తం నిషేధం విధిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు వేర్వేరు చోట్ల పని చేస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించనున్నారు. కోట్లాది రూపాయాలు ఖర్చచేసి ఆస్పత్రులు నిర్మిస్తున్నా.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇక దీనికి […]

Written By: Velishala Suresh, Updated On : September 26, 2021 10:24 am
Follow us on

ఏపీలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యం అందించడంపై  ప్రభుత్తం నిషేధం విధిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు వేర్వేరు చోట్ల పని చేస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించనున్నారు.

కోట్లాది రూపాయాలు ఖర్చచేసి ఆస్పత్రులు నిర్మిస్తున్నా.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇక దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రైవేటు ప్రాక్టీసు వల్ల కొందరు వైద్యులు ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ణీత వేళల్లో ఉండడంలేదని, అతిథులుగా వచ్చి వెళ్తున్నారన్న ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం, పరీక్షల కోసం  తెలిసిన వారు నిర్వహించే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని కూడా సూచిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం పై చర్చలు జరుగుతున్నాయి.

నిషేధం పై ఉత్తర్వులు ఇచ్చే  క్రమంలో ప్రస్తుతం వైద్యులకు చెల్లిస్తున్న వేతనాలు, అందుకున్న ఆర్థిక ప్రయోజనాలపై నా చర్చ జరుగుతోంది. ఇలా ప్రాక్టీసు చేయడంపై వైద్య ఆరోగ్య శాఖలో పలు రకాల జీవోలు ఉన్నాయి. వీటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 27తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. 85 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. కొత్తగా నియమించనున్న వైద్యులు, నర్సులు ఫార్మాసిస్టుల కోసం ఏటా ప్రభుత్వం పై అదనంగా 676 కోట్ల రుపాయల భారం పడునుంది.