దేశంలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతున్నారు. 3,29,351 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,032 మంది వైరస్ నుంచి బయట పడ్డారు. 260 మంది మరణించారు. కాగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 16,671 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 26,032 మంది కొవిడ్ ను జయించగా ఇప్పటి వరకూ కోలుకున్న వారిసంఖ్య 3.29 కోట్లు దాటింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,03,476 గా ఉంది. ఇక కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 16,671 కేసులు 120 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 68,42,786 మందికి టీకాలు అందించారు.
దీంతో ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 85,60,81,527కి చేరింది. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కో రోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో హచ్చుతగ్గులుంటున్నాయి. తాజాగా, 1100 కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,307 నమూనాలను పరీక్షించగా 1167 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 7 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 20,18,324కి చేరింది. రాష్ట్రంలో కొత్త కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.