వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు !

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వేగం పెరుగుతోంది. సీబీఐ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను కాకుండా కేసుతో సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో […]

Written By: Srinivas, Updated On : August 11, 2021 3:19 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వేగం పెరుగుతోంది. సీబీఐ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను కాకుండా కేసుతో సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకుందని తెలుస్తోంది. వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలతో ఎర్ర గంగిరెడ్డితో పాటు ఇంకా కొందరిని సీబీఐ గుర్తించింది. రంగన్న ఇచ్చిన ఆధారాలతోనే సునీల్ కుమార్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇంత పెద్ద హత్యోదంతంలోో సునీల్ కుమార్ యాదవ్ పాత్రపై ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు వివేకా హత్యకేసులో సునీల్ కుమార్ యాదవే ప్రధాన పాత్రధారిగా కనిపిస్తున్నాడు. ఆయన ఇస్తున్న ఆధారాలతోనే కేసు పురోగతి ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. సునీల్ యాదవ్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ తనను అనవసరంగా అరెస్టు చేసిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయోనని చూస్తున్నారు.

సునీల్ కుమార్ యాదవ్ ఏ అంశాలు బయటపెడతాడో అని ఎదురు చూస్తున్నారు. సీబీఐ దర్యాప్తుపై ఇప్పటికే ఆరోపణలు వస్తుండడంతో సునీల్ ను కేసులో ఇరికించారని అనుమానాలు ఇప్పటికే వస్తున్నాయి. దీంతో సీబీఐ పై చేస్తున్న ఆరోపణలకు ఏం సమాధానాలు చెబుతారో అని ఉత్కంఠ నెలకొంది. సీబీఐ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కూడా వెల్లడించలేదు.

ఈ కేసులో పెద్దవారిని కాపాడే ప్రయత్నంలో సునీల్ ను బాధ్యుడిని చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో పెద్ద తలకాయలు ఎవరనేదే చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికైతే స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులే కారణమన్న అనుమానాలు వస్తున్నాయి. మొదటినుంచి వివేకా హత్య కేసు అనుమానాస్పదంగా ఉండడంతో సీబీఐ దర్యాప్తులో కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి సీబీఐ సునీల్ యాదవ్ పేరును మాత్రం తెరపైకి తెచ్చిందని చెబుతున్నారు.

వివేకా హత్యకేసులో వైఎస్ కుటుంబీకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలున్నా వారిని మాత్రం అరెస్టు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను ఎందుకు బాధ్యులను చేయడం లేదనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా కుమార్తె సునీతా రెడ్డి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు చేయాలని కోరారు. మొత్తానికి ఎటు వైపు తిరుగుతుందో ఈ కేసు అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.