
టీఆర్ ఎస్ లో మంత్రి ఈటల రాజేందర్ దుమారం రేపుతున్నారు. ఈటల రాజేందర్ పై కబ్జా ఆరోపణలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈటలపై వేటుకు రంగం సిద్ధమైందని టీఆర్ ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కబ్జా ఆరోపణలపై కాసేపట్లో ఈటల వివరణ ఇవ్వనున్నారు. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటుని ఆయన వాపోయారు. ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ లో కలకలం రేగుతోంది. కిరాయిదారులం కాదు పార్టీకి ఓనర్లమంటూ ఇటీవల ఈటల రాజేందర్ వ్యాఖ్యానించి టీఆర్ ఎస్ లో ప్రకంపనలు సృష్టించారు.