
కరోనాకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు యాంటీవైరల్ ఇంజక్షన్ రెమ్ డెసివిర్ ను తీసుకోవద్దని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా సూచించారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెమ్ డెసివిర్ ను తీవ్రంగా ఉన్న కేసుల్లో మాత్రమే ఇస్తామని, కాబట్టి ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకుంటున్న వారు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రెమ్ డెసివిర్ ను వైద్య నిపుణుడి సమక్షంలో ఆసుపత్రిలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.