
ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. తెలంగాన భవన్ లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్ ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, వంటి పథకాలను ఈటల విమర్శించారు. రాజేందర్ లాంటి బీసీ నాయకుడు ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు అసైన్డ్ భూముల జోలికి పోవద్దు మరి ఆ నిబంధనను ఉల్లంఘించడం నేరం. దాని పై విచారణ జరుగుతోందని తెలిపారు.