spot_img
Homeఅంతర్జాతీయంIslamic NATO : ఇస్లామిక్‌ నాటో సాధ్యమేనా.. ఏర్పడితే భారత్‌కు లాభమా నష్టమా?

Islamic NATO : ఇస్లామిక్‌ నాటో సాధ్యమేనా.. ఏర్పడితే భారత్‌కు లాభమా నష్టమా?

Islamic NATO : అంతర్జాతీయ దౌత్యాలను అధ్యయనం చేసే వారికి ఒక ప్రధాన సందేహం ఏమిటంటే, యూరోపియన్‌ దేశాలు నాటో ఏర్పడినట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 57 ముస్లిం దేశాలు ఇస్లామిక్‌ నాటో ఎందుకు ఏకం కావడం లేదు? కలిస్తే ప్రపంచంలో అతి శక్తివంతమైన సైనిక అలయాన్స్‌ ఏర్పడుతుంది. ఇస్లామ్‌లో ’ఉమ్మ’ అనే ఐక్యతా భావన ఉన్నప్పటికీ, ఇది రూపొందలేదు. ఓఐసీ(ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌) 1967 ఇజ్రాయెల్‌ దాడి తర్వాత ఏర్పడినా, అందులో సైనిక ఒప్పందాలు లేవు.

సున్నీ–షియా విభేదాలు..
ముస్లిం దేశాల్లో సున్నీ–షియా మతపరమైన విభేదాలు ఐక్యతకు అతిపెద్ద సవాలు. సౌదీ అరేబియా వంటి సున్నీ దేశాలు ఇరాన్‌ వంటి షియా దేశాలతో పోటీ పడుతున్నాయి. లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాక్‌లో ఈ పోరాటాలు కొనసాగుతున్నాయి. అజర్‌బైజాన్, ఇరాన్‌ లాంటి షియా దేశాలు సున్నీలతో కలవడం లేదు. ఈ మతపరమైన విభజన ఏకీకరణకు మూలం.

సామూహిక రక్షణ లేకపోవడం
నాటోలో ఒక సభ్యదేశంపై దాడి అంటే అందరిపై దాడిగా పరిగణించి సంయుక్తంగా పోరాడతాయి. ముస్లిం దేశాల్లో ఇలాంటి ఉమ్మడి రక్షణ అవగాహన లేదు. పరస్పర సంఘర్షణలు, విరుద్ధ సైనిక లక్ష్యాలు దీన్ని కుంటున్నాయి. ఉదాహరణకు, భారత్‌–పాకిస్తాన్‌ ఘర్షణల్లో ఇతర ముస్లిం దేశాలు స్పందించలేదు. ఈజిప్ట్‌ నార్త్‌ ఆఫ్రికా ముస్లిం దేశాలను ప్రభావితం చేస్తోంది. ఇండోనేషియా దక్షిణ తూర్పు ఆసియా సైనిక విషయాలపై దృష్టి పెట్టుకుంది.

ప్రాంతీయ విభేదాలు..
ముస్లిం దేశాలు ప్రాంతీయ విషయాల్లో విభజనలు ఉన్నాయి. ఇండోనేషియాకు చైనాతో సముద్ర సరిహద్దు వివాదాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండోనేషియా జనాభా అధిక దేశాలు అయినా, స్థానిక సమస్యల్లో మునిగిపోయాయి. సౌదీ అరేబియా ధనవంతమైనా, పాకిస్తాన్‌ అణ్వాయుధాలు కలిగినా, టర్కీ సైనిక శక్తివంతమైనా, పరస్పర విశ్వాసం లేదు. అరబ్‌ దేశాలు అమెరికాపై, ఇరాన్‌–ఇరాక్‌ రష్యాపై, కొన్ని చైనాపై ఆధారపడ్డాయి. ఈ బాహ్య ఆధారాలు ఇస్లామిక్‌ ఐక్యతను బలహీనపరుస్తున్నాయి.

టర్కీ కేంద్రంగా కొన్ని దేశాలు, సౌదీ చుట్టూ మరికొన్ని, ఇరాన్‌ మద్దతుతో ఇతరులు పనిచేస్తున్నాయి. సమాచారం, సైన్యం, వ్యూహాలు పంచుకోవడం లేకపోవడం వల్ల ఇస్లామిక్‌ నాటో దూరంగా ఉంది. మతపరమైన విభేదాలు, ప్రాంతీయ పోటీలు, బాహ్య ప్రభావాలు ఐక్యతకు అడ్డుకట్టలు. ఉమ్మ భావన రాజకీయంగా అమలు కావాలంటే పరస్పర విశ్వాసం తప్పనిసరి. ఇస్లామిక్‌ నాటో ఏర్పడితే పాకిస్తాన్‌ విషయంలో భారత్‌కు ఇబ్బందులు తప్పవు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version