Virat Kohli IND vs NZ : క్రికెట్ లో ఎవడైనా సరే పరుగులు తీస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి పరుగులు తీసిన వాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ జాబితాలో విరాట్ కోహ్లీకి శిఖర స్థాయి ఉంటుంది. ఇదేదో విరాట్ కోహ్లీ మీద అభిమానంతో చెబుతున్న మాట కాదు. అతడి ట్రాక్ రికార్డే మనకు చెబుతుంది.
సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్లేయర్లు మొత్తం నిరాశ జనకమైన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం బాహుబలి లాగా నిలబడ్డాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఒక దీపశిఖలాగా వెలుగును ప్రసరించాడు. దురదృష్టవశాత్తు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక క్యాచ్ అవుట్ కాకుండా ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ ఈతరంలో ఒక అద్భుతమైన ఆటగాడని మరోసారి నిరూపితమైనది. గడిచిన 1 8 సంవత్సరాలుగా.. నిరంతరాయంగా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఏనాడు కూడా తన పోరాటపటిమను విస్మరించలేదు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరుగులు చేయకుండా వెళ్లిపోవడం విరాట్ కోహ్లీ చరిత్రలో లేదు. వన్డే ఫార్మాట్లో రికార్డు స్థాయిలో సెంచరీలు చేసినప్పటికీ.. విరాట్ కోహ్లీ ఎక్కువగా చేజింగ్ సమయంలోనే పరుగులు తీయడం విశేషం. ఇండోర్ లో ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 124 పరుగులు చేశాడు.. దీనికంటే ముందు గతంలో చేజింగ్ సమయంలో అతడు నాలుగు సెంచరీలు కూడా చేశాడు. అయితే అప్పుడు జరిగిన మ్యాచ్ లలో టీమిండియా ఓటమిపాలైంది. వాస్తవానికి జట్టు ప్లేయర్లు మొత్తం విఫలమవుతున్న వేళ.. విరాట్ కోహ్లీ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు. ఫలితంగా నాటి మ్యాచ్లలో టీమిండియా దారుణమైన ఓటముల నుంచి తప్పించుకుంది.
ఇండోర్లో జరిగిన మ్యాచ్లో 124 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 2019లో రాంచి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై 95 బంతుల్లో 123 పరుగులు చేశాడు. 2018లో పూణే వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 119 బంతుల్లో 107 పరుగులు చేశాడు. 2016లో కాన్బెర్ర వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 92 బంతుల్లో 106 పరుగులు చేశాడు. నేపియర్ వేదికగా 2014లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 111 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో ఆడతాడు కాబట్టే విరాట్ కోహ్లీని ఈ కాలపు బాహుబలి అని పిలుస్తుంటారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ సోషల్ మీడియా మొత్తం విరాట్ కోహ్లీ నామస్మరణ చేస్తోంది. దీన్నిబట్టి అతని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని టీమిండియా తరఫున బాహుబలి లాగా అభిమానులు పోల్చుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గొప్ప ఆటగాడు ఎప్పటికీ.. గొప్పగానే పరుగులు చేస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ సిగ్గు తెచ్చుకోవాలని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
