Ishan Kishan mistake : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతమైదానంలో ఓడిపోయింది. భారీగా పరుగులు చేసి.. విధ్వంసం సృష్టిస్తుందనుకుంటే 156 పరుగుల వద్దే ఆగిపోయింది. దీనిని చేదించడానికి లక్నో జట్టు చివరి వరకు పోరాడింది. కెప్టెన్ రిషబ్ పంత్(68*) విరోచిత హాఫ్ కంచరీ చేయడంతో లక్నో జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
వాస్తవానికి ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది హైదరాబాద్ జట్టు. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ జట్టు పరువు కాపాడారు. హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తే.. హైదరాబాద్ బౌలర్లు మాత్రం దారుణంగా బౌలింగ్ చేశారు.. హర్ష్ దూబే, హర్షల్ పటేల్ మెరుగ్గా బౌలింగ్ చేశారు. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా జయదేవ్ హైదరాబాద్ జట్టుకు ప్రతిబంధకంగా నిలిచాడు..
చివరి ఓవర్ లో లక్నో జట్టు విజయానికి 9 పరుగులు అవసరం. జయదేవ్ బంతి అందుకున్నాడు. కట్టుదిట్టంగా బంతులు వేయాల్సిన చోట.. తేలిపోయాడు.. అతని బౌలింగ్ లో తొలి రెండు బంతులను పంత్ బౌండరీలకు తరలించాడు. దీంతో లక్నో జట్టు గెలుపు సునాయాసమైంది.
రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. చివరి ఓవర్ లో గుజరాత్ జట్టు విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బౌలింగ్ అందుకున్న తుషార్ దేశ్ పాండే కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా పడగొట్టాడు. కానీ తుషార్ మాదిరిగా బౌలింగ్ వేయడంలో జయదేవ్ విఫలమయ్యాడు. తొలి రెండు బంతులను అత్యంత దారుణంగా వేసి.. తన నిర్లక్ష్యాన్ని చాటుకున్నాడు.
జయదేవ్ స్థానంలో ఇంకొక బౌలర్ తో బౌలింగ్ వేయించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అప్పటికీ జయదేవ్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఆ విషయం తెలిసి కూడా కెప్టెన్ ఇషాన్ కిషన్ జయదేవ్ కు బౌలింగ్ ఇవ్వడం అతని నిర్లక్ష్యానికి పరాకాష్ట. జయదేవ్ కట్టుదిట్టంగా బంతులు వేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. మొదట్లో బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్ లో విఫలమై.. హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో తగిన మూల్యం చెల్లించుకుంది.