Iran US attack : ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అణ్వాయుధాలు తయారు చేస్తుందన్న సాకుతో సుమారు నెల రోజులు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కానీ అణు కార్యక్రమాలు నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించలేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టింది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పాకిస్తాన్‌లో నిరసనలు
ఖమేనీ హత్యకు నిరసనగా పాకిస్తాన్‌ఖలో నిరసనలు మొదలయ్యాయి. కరాచీలో అమెరికా కాన్సులేట్‌పై షియా సమాజాలు దాడి చేసేందుకు యత్నించాయి. భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి అంతర్గత ఒత్తిడి పెంచుతోంది. పాకిస్తాన్‌లో కూడా షియా ముస్లింలు ఎక్కువ. అందుకే ఇరాన్‌కు మద్దతుగా అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఆసిమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ అమెరికాతో ఆర్థిక బంధాలు కాపాడుకుంటూ ఇరాన్‌కు మద్దతు చెప్పాల్సి ఉంది. షియా గుర్తింపు బలంగా ఉన్న పాకిస్తాన్‌లో తిరుగుబాటు ప్రమాదం ఉంది. ప్రజల భావోద్వేగాలు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అమెరికా–ఇజ్రాయెల్ ఆధిపత్య లక్ష్యాలు
ఇదిలా ఉంటే ట్రంప్ రెజీమ్ చేంజ్ వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇంటలిజెన్స్ సంస్థ మోసాద్ సమాచారంతోనే ఖమేనీని అమెరికా చంపేసింది. బంకర్ బస్టర్ బాంబులు ఉపయోగించారు. రెజీమ్ చేంజ్ వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని, సుమారు వారం రోజులు పట్టవచ్చని ట్రంప అంటున్నారు. మరోవైపు ఇరాన్.. అమెరికా గతంలో ఎన్నడూ చూడని యుద్ధం చూస్తుందని హెచ్చరించింది.
ఇజ్రాయెల్ వాదనలు
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రజలను రోడ్లపైకి రావానలి పిలుపునిచ్చారు. ఇరాన్‌పై మరినొక దాడి ప్రకటించారు. ఇరాన్ రెండు ముక్కలు అవుతుందని తెలిపారు.
అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందా..
ఇదిలా ఉంటే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో బాధ్యతలు చేపట్టే వ్యక్తి అమెరికాకు అనుకూలంగా ఉంటుందా అన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. గతంలో అమెరికా దాడిచేసిన దేశాల్లో అనుకూల ప్రభుత్వం ఏర్పడదని చరిత్ర సూచిస్తోంది. లిబియా, ఇరాక్‌లాగా ఇరాన్‌లో కూడా అస్థిరత మాత్రమే పెరుగుతుంది. ఖమేనీ కుమారుడికి అవకాశం రాకుండా చూడాలని అమెరికా సూచిస్తోంది.