https://oktelugu.com/

ఆనందయ్య మందును పరిశీలించిన టీడీపీ బృందం

ఆనందయ్య మందుపై అపోహలు వద్దు. అది సంజీవనిలా పని చేస్తుంది. కాలయాపన చేస్తూ ప్రజలను వైద్యానికి దూరం చేయొద్దు. ఈ విషయాన్ని ఆయుష్ అంగీకరించినా ఇంకా తాత్సారమెందుకని టీడీపీ నేతల బృందం ప్రశ్నించింది. టీడీపీ ప్రతినిధుల బృందం ముందే ఆనందయ్య ఓ బాలుడికి మందు వేయగా అతడు లేచి కూర్చున్నాడు. దీంతో బృందం మందు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే మందు పంపిణీ చేయాలని సూచించింది. టీడీపీ ప్రతినిధుల బృందం మంగళవారం కృష్ణపట్నం సందర్శించింది. బృందంలో […]

Written By: , Updated On : May 25, 2021 / 06:28 PM IST
Follow us on

Ayurvedic Medicine
ఆనందయ్య మందుపై అపోహలు వద్దు. అది సంజీవనిలా పని చేస్తుంది. కాలయాపన చేస్తూ ప్రజలను వైద్యానికి దూరం చేయొద్దు. ఈ విషయాన్ని ఆయుష్ అంగీకరించినా ఇంకా తాత్సారమెందుకని టీడీపీ నేతల బృందం ప్రశ్నించింది. టీడీపీ ప్రతినిధుల బృందం ముందే ఆనందయ్య ఓ బాలుడికి మందు వేయగా అతడు లేచి కూర్చున్నాడు. దీంతో బృందం మందు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే మందు పంపిణీ చేయాలని సూచించింది.

టీడీపీ ప్రతినిధుల బృందం మంగళవారం కృష్ణపట్నం సందర్శించింది. బృందంలో సోమిరెడ్డి, బిదా రవిచంద్ర, పె ళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. అక్కడ జరిగిన ఘటన టీడీపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ రాష్ర్టంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి విషమ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడు. దీంతో ఆనందయ్య ఆ బాలుడి కంట్లో మందు వేశాడు. అంతే ఆ విద్యార్థి 15 నిమిషాల్లోనే లేచి కూర్చున్నాడు. దీంతో సోమిరె డ్డి బృందం ఆశ్చర్యపోయింది. ఆనందయ్య మందు పంపిణీ జరగాలని వారు కోరారు.

రాజకీయాలకతీతంగా మందు పంపిణీ జరగాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. జిల్లా అధికారులు, నాయకులు ఆనందయ్య మందు పంపిణీపై దృష్టి సారించాలని సూచించారు. పేదలకు న్యాయం జరిగేందుకు ఇదే సరైన సమయం అన్నారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయడం సరికాదని హితవు పలికారు. మందు పంపిణీపై సీఎం చొరవ చూపాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆనందయ్య మందు నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు.

ఆనందయ్య మందుపై లేనిపోని అపోహలు సృష్టించవద్దని సూచించారు. మందు పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు లేవని స్పష్టం చేశారు. అనవసర పట్టింపులకు పోయి మందు పంపిణీలో జాప్యం రాకుండా చూసుకోవాలని చె ప్పారు. దీనికి ఎ వరిని బాధ్యులను చేయాల్సిన పనిలేదన్నారు. మందు వినియోగం అయ్యేలా చూసి ప్రాణాలు కాపాడాలని ఆకాంక్షించారు.-