
ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం మంగళవారం టెండర్లు ఆహ్వానించింది బీసీసీఐ. 2022 ఐపీఎల్ సీజన్ లో పాల్గొనబోయే రెండు కొత్త టీమ్స్ లో ఒకదాని కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బిడ్లను ఆహ్వానించిందని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెండర్ డాక్యుమెంట్లు అక్టోబర్ 5 వరకూ అమ్మకానికి ఉండనున్నట్లు చెప్పింది. ఈ ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్ ను రూ. 10 లక్షలుగా నిర్ణయించింది.